టీచర్లను కించపరిచేలా విద్యా కమిషన్ నివేదిక
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:26 AM
విద్యా కమిషన్ ఇచ్చిన నివేదిక ఉపాధ్యాయ లోకాన్ని కించపరిచేలా ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సమస్త ఉపాధ్యాయవర్గమంతా...
ప్రభుత్వ బడుల్లో తగ్గిన విద్యార్థుల శాతం: హరీశ్‌రావు
చిన్నకోడూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): విద్యా కమిషన్ ఇచ్చిన నివేదిక ఉపాధ్యాయ లోకాన్ని కించపరిచేలా ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సమస్త ఉపాధ్యాయవర్గమంతా ఈ నివేదికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేస్తోందా.. బలహీన పరుస్తోందా.. ? అర్థం కావడంలేదన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం ప్రాథమికోన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన వార్షికోత్సవంలో హరీశ్‌రావు మాట్లాడారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనను ప్రారంభించిందని తెలిపారు. ఉదయం అల్పాహారం, మన ఊరు - మన బడి కార్యక్రమాలను సైతం మొదలు పెట్టిందని దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడంతో ఈ పథకాలు నిలిచిపోయాయని ఆయన అన్నారు.