Share News

కొడంగల్‌ బిడ్డనంటూ.. ప్రజల ఇళ్లు కూలుస్తావా రేవంత్‌?:హరీశ్‌

ABN , Publish Date - Sep 30 , 2026 | 06:49 AM

‘‘పేదల బతుకులను రోడ్డున పడేయడమే మీ ప్రజా పాలనా..? అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? కొడంగల్‌ బిడ్డనంటూనే అక్కడి ప్రజల ఇళ్లు కూల్చుతావా’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ప్రశ్నించారు.

కొడంగల్‌ బిడ్డనంటూ..  ప్రజల ఇళ్లు కూలుస్తావా రేవంత్‌?:హరీశ్‌
Harish Rao

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘పేదల బతుకులను రోడ్డున పడేయడమే మీ ప్రజా పాలనా..? అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? కొడంగల్‌ బిడ్డనంటూనే అక్కడి ప్రజల ఇళ్లు కూల్చుతావా’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘‘కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరులో రాత్రికి రాత్రే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను నడిపించే హక్కు నీకు ఎవరిచ్చారు?


కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?’’ అని మంగళవారం ఎక్స్‌ వేదికగా ఆయన నిలదీశారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా గౌరవించరా? ఒక్కసారిగా ఇండ్లు కూల్చితే, ఏళ్లతరబడి నివాసం ఉన్నవారు ఒక్కసారిగా ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బుల్డోజర్‌ రాజ్‌ అమలు చేయడం తగదన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 06:49 AM