అక్రమ మైనింగ్, రియల్ దందాల్లో రేవంత్ సర్కార్
ABN , Publish Date - Mar 04 , 2026 | 02:33 AM
రాష్ట్రంలో అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాలకు రేవంత్‌రెడ్డి సర్కార్ తెరలేపిందని, అనుమతుల్లేకుండానే రాజేంద్రనగర్ మానస హిల్స్‌లో మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కొండలను పిండి చేస్తోందని...
పొంగులేటి అక్రమాలపై స్పందించరేం?: హరీశ్ రావు
హైదరాబాద్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాలకు రేవంత్‌రెడ్డి సర్కార్ తెరలేపిందని, అనుమతుల్లేకుండానే రాజేంద్రనగర్ మానస హిల్స్‌లో మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కొండలను పిండి చేస్తోందని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. పేదల ఇళ్లను కూల్చే హైడ్రాకు.. మంత్రులు, వారి బంధువుల అక్రమ క్వారీలు, భూకబ్జాలు కనిపించడం లేదా అని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. విద్యుత్ మంత్రి భట్టి విక్రమార్క, పర్యావరణ మంత్రి కొండా సురేఖ, గనులశాఖ మంత్రి వివేక్ సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దునిద్ర నటిస్తోందో.. సమాధానం చెప్పాలన్నారు. అధికారుల నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఎంతెంత వాటాలు ముడుతున్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.