Share News

బాపూజీకి ఘన నివాళి

ABN , Publish Date - Jan 31 , 2026 | 04:25 AM

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా లంగర్‌హౌజ్‌లోని బాపుఘాట్‌ వద్ద గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టి....

బాపూజీకి ఘన నివాళి

  • నివాళుర్పించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌, డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, కార్వాన్‌, జనవరి 30(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా లంగర్‌హౌజ్‌లోని బాపుఘాట్‌ వద్ద గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి పొన్నం, టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. గాంధీ ఫొటో ప్రదర్శనను కూడా తిలకించారు. మరోవైపు గాంధీభవన్‌లో గాంధీ విగ్రహం వద్ద టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌, పార్టీ సీనియర్‌ నేత వి. హన్మంతరావు తదితరులు నివాళులర్పించారు.

Updated Date - Jan 31 , 2026 | 04:25 AM