Share News

వెలుగుమట్ల భూమాఫియాపై కఠిన చర్యలు: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:51 AM

ఖమ్మం వెలుగుమట్ల భూమాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.

వెలుగుమట్ల భూమాఫియాపై కఠిన చర్యలు: మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం వెలుగుమట్ల భూమాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. అక్కడి భూదాన్‌ భూములను భూ మాఫియా అమాయక ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకున్నారని, వారి నుంచి సొమ్ము వసూలు చేసి ప్రజలకు అందిస్తామని మంత్రి సోమవారం ఎక్స్‌లో తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఎలాంటి అన్యాయం జరగదని, ఇళ్లు కోల్పోయినవారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. వెలుగుమట్ల పరిస్థితి, న్యాయపరమైన అంశాలపై ప్రభుత్వం పరిశీలిస్తుందని, కేవలం రాజకీయపరమైన లబ్ధి కోసమే ఈ వివాదంలో కేరళ కాంగ్రెస్‌ను లాగుతున్నారని మండిపడ్డారు.

Updated Date - Mar 03 , 2026 | 03:51 AM