Share News

బంగారం కాయిన్ల స్టాక్‌ లేదు!

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:17 AM

ఇప్పటివరకు రేషన్‌ దుకాణాలు, పెట్రోల్‌ బంక్‌లు, గ్యాస్‌ డీలర్ల వద్ద ‘స్టాక్‌ లేద’నే మాట విన్నాం. ఇప్పుడు బంగారం దుకాణాల వద్ద కూడా ఈ మాట వినిపిస్తోంది.

బంగారం కాయిన్ల స్టాక్‌ లేదు!

  • బంగారం, వెండి ధరల పరుగుతో కొనుగోలుకు పోటీ!

మూసాపేట్‌, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఇప్పటివరకు రేషన్‌ దుకాణాలు, పెట్రోల్‌ బంక్‌లు, గ్యాస్‌ డీలర్ల వద్ద ‘స్టాక్‌ లేద’నే మాట విన్నాం. ఇప్పుడు బంగారం దుకాణాల వద్ద కూడా ఈ మాట వినిపిస్తోంది. నెల రోజుల నుంచి బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలామంది బంగారంపై పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు. వారు బంగారం దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. అయితే పలు ప్రాంతాల్లోని షాపుల్లో అభరణాలు తప్ప బిస్కెట్లు, కాయిన్ల స్టాక్‌ లేదని చెబుతున్నారు. బంగారం బిస్కట్‌ కావాలంటే 10 రోజులు ఆగాలని, ఇప్పుడు డబ్బులు చెల్లిస్తే తర్వాత ఇస్తామంటున్నారని వినియోగదారులు చెబుతున్నారు. చాలామంది రియల్‌ ఎస్టేట్‌, ఇతర వ్యాపారులు పూర్తిగా బంగారంవైపు వస్తున్నట్లు అర్థమవుతోందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు బంగారం కోసం స్కీమ్‌లు పెట్టేవారమని, ఇప్పడు వారే ఫోన్‌ చేసి రేటు తెలుసుకుని వస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. ఇక మార్కెట్‌లో ఏ ఇద్దరు కలిసినా బంగారం, వెండి ధరల గురించే చర్చించుకుంటున్నారు.

Updated Date - Jan 29 , 2026 | 05:18 AM