Share News

సబ్సిడీ పెంచకుంటే ఎరువులు భారమే?

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:05 AM

ఎరువుల తయారీలో కీలకమైన ముడి పదార్థాలపై కేంద్రం బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ (బీసీడీ) మినహాయింపులను రద్దు చేయడంతో ఎరువుల ధరలపై ప్రభావంపడే అవకాశం ఉంది.

సబ్సిడీ పెంచకుంటే ఎరువులు భారమే?

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఎరువుల తయారీలో కీలకమైన ముడి పదార్థాలపై కేంద్రం బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ (బీసీడీ) మినహాయింపులను రద్దు చేయడంతో ఎరువుల ధరలపై ప్రభావంపడే అవకాశం ఉంది. అమ్మోనియం ఫాస్పేట్‌, అమ్మోనియం నైట్రో ఫాస్పేట్‌, పొటాషియం సల్ఫేట్‌ లాంటి ఉత్పత్తులపై ఇంతవరకున్న బీసీడీ మినహాయింపులను కేంద్రం ఉపసంహరించుకుంది. ఫలితంగా డీఏపీ, ఎన్‌పీకే వంటి కాంప్లెక్స్‌ ఎరువుల తయారీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఫాస్పేట్‌, పొటాష్‌ ఆధారిత ఎరువుల ముడి పదార్థాలు ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎరువుల ధరలు పెరగకుండా ప్రభుత్వం సబ్సిడీని పెంచాల్సి ఉంటుంది. 2025-26లో కేంద్రం సుమారు రూ.1.90 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ భారాన్ని మోసినట్లు సమాచారం.

Updated Date - Feb 02 , 2026 | 03:05 AM