నాపై దుష్ప్రచారం చేస్తున్నారు
ABN , Publish Date - Jan 29 , 2026 | 06:09 AM
కొంత మంది తనపై దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు.
కేటీఆర్, హరీశ్‌పై మాజీ ఎమ్మెల్యే సంపత్ ఫిర్యాదు
నార్సింగ్, జనవరి 28 (ఆంద్రజ్యోతి): కొంత మంది తనపై దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ అధికార ప్రతినిఽధి క్రిశాంక్, నమస్తే తెలంగాణ ఎడిటర్, తెలుగు స్ర్కైబ్ డిజిటల్ మీడియా ఇన్‌చార్జ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 11న నమస్తే తెలంగాణ పత్రికలో ‘8 కోట్లు ఇస్తావా, పనులు ఆపమంటావా?’ అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించారని, ఇది తనను కలచివేసిందని అన్నారు. అలంపూర్ రోడ్డు నిర్మాణంలో తనకు సంబంధం లేకున్నా బద్నాం చేస్తూ కథనాలు రాస్తున్నారని సంపత్ ఫిర్యాదులో పేర్కొన్నారు.