Share News

విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు బీమా పరిహారం

ABN , Publish Date - Sep 01 , 2026 | 03:15 AM

విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రమాద బీమా పరిహారాన్ని అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున మూడు కుటుంబాలకు మొత్తం రూ.3 కోట్లను సోమవారం అందజేశారు.

విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు బీమా పరిహారం

  • రూ. కోటి వంతున అందజేసిన డీజీపీ ఆనంద్‌

హైదరాబాద్‌, ఆగస్టు31(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రమాద బీమా పరిహారాన్ని అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున మూడు కుటుంబాలకు మొత్తం రూ.3 కోట్లను సోమవారం అందజేశారు. శంకరపల్లి పరిధిలో 2025 ఫిబ్రవరి 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2018 బ్యాచ్‌కు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ముత్తంగి శ్రీనివాస్‌ మరణించారు. నల్గొండ జిల్లా కనగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 2004 బ్యాచ్‌ పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌ బోలేపల్లి సైదులు 2025 జూన్‌ 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వరంగల్‌కు చెందిన కానిస్టేబుల్‌ కె.వెంకటరెడ్డి 2026 మార్చి 10న లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందారు. వీరి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించారు.

Updated Date - Sep 01 , 2026 | 05:18 AM