రోడ్డున పడ్డాం... ఆదుకోండి!
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:54 AM
వైద్య ఆరోగ్యశాఖలో శాశ్వత నియామకాలు చేపట్టడంతో తాము రోడ్డున పడ్డామని, తమపై దయ చూపాలని కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
హెల్త్ సెక్రటరీకి కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ల విజ్ఞప్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో శాశ్వత నియామకాలు చేపట్టడంతో తాము రోడ్డున పడ్డామని, తమపై దయ చూపాలని కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, డీహెచ్ డాక్టర్ రవీందర్ నాయక్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. 10 ఏళ్లుగా తాము కాంట్రాక్ట్ విధానంలో ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నామని, తాజాగా రెగ్యులర్ అభ్యర్థులు రావడంతో తమ ఉద్యోగాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలు ఉన్న చోట పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని వారు కోరారు.