Share News

ఎన్నికల్లో లబ్ధికి కేటీఆర్‌ విష ప్రచారం:చామల

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:29 AM

మున్సిపల్‌ ఎన్నికల్లో లబ్ది పొందడానికి కాంగ్రెస్‌ పార్టీపై విషం చిమ్మేందుకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.

ఎన్నికల్లో  లబ్ధికి కేటీఆర్‌ విష ప్రచారం:చామల

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో లబ్ది పొందడానికి కాంగ్రెస్‌ పార్టీపై విషం చిమ్మేందుకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఏదో ఒకటి చేసి మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపొందేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ జాతిపిత అంటూ కేటీఆర్‌ పిట్టకథలు చెబుతున్నారని చామల అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు పోరాడరని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వని కేటీఆర్‌.. ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 03:29 AM