Share News

ఉద్యమకారులకు హామీల అమలుపై కమిటీ

ABN , Publish Date - Mar 13 , 2026 | 05:11 AM

తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకోసం ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. దీనిలో సభ్యుల నియామకానికి అర్హత...

ఉద్యమకారులకు హామీల అమలుపై కమిటీ

  • విధివిధానాలపై మంత్రి పొన్నం, కోదండరాం భేటీ

హైదరాబాద్‌, మార్చి 12(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకోసం ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. దీనిలో సభ్యుల నియామకానికి అర్హత, విధివిధానాలు తదితరాలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ భేటీ అయ్యి ప్రాథమికంగా చర్చించారు. గురువారం పొన్నం ప్రభాకర్‌ నివాసంలో ఈ భేటీ జరిగింది. కమిటీలో మహిళలతో పాటు వివిధ వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించాలనుకున్నారు. ఉద్యమకారులుగా గుర్తించేందుకు అర్హత, జిల్లాల వారీగా వారి గుర్తింపు, ఉద్యమకారుల డిమాండ్లపైన అధ్యయనం చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ వారంలోనే మరోమారు భేటీ అయి కమిటీకి తుది రూపు తేవాలని, సీఎం రేవంత్‌రెడ్డితో కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు.

Updated Date - Mar 13 , 2026 | 05:11 AM