తెలంగాణ రైజింగ్ విజన్’కు సహకరించండి
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:11 AM
తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్’కు సహకరించాలని కెనడీ స్కూల్ ప్రొఫెసర్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు.
కెనడీ స్కూల్ ప్రొఫెసర్లను కోరిన సీఎం రేవంత్‌రెడ్డి
సానుకూలంగా స్పందించిన ఇద్దరు ప్రొఫెసర్లు
హైదరాబాద్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్’కు సహకరించాలని కెనడీ స్కూల్ ప్రొఫెసర్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిఽధిలోని కెనడీ స్కూల్‌లో ప్రత్యేక కోర్సు చదువుతున్న రేవంత్‌రెడ్డి.. అక్కడ ఇద్దరు ప్రొఫెసర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. వైస్ ప్రోవొ్‌స్ట-హెడ్ ఆఫ్ హార్వర్డ్ ఎక్స్ డస్టిన్ టింగ్లీ, కెనడీ స్కూల్ డీన్ జెర్మీ విన్‌స్టిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్’ గురించి వారికి సీఎం వివరించారు. అనంతరం రైజింగ్ విజన్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకున్న అవకాశాలపైనా చర్చించారు. అనంతరం సీఎం రేవంత్ ప్రతిపాదన పట్ల ఇద్దరు ప్రొఫెసర్లు సానుకూలంగా స్పందించారు. అలాగే విద్యలో మార్పులు, నాణ్యమైన విద్య, ఆధునిక నైపుణ్య శిక్షణ, అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి సంబంఽధించిన అంశాలపై చర్చించినట్టు సీఎం కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.