Share News

సీఎస్‌ రామకృష్ణారావుకు మరో 3 నెలల ఎక్స్‌టెన్షన్‌?

ABN , Publish Date - Mar 09 , 2026 | 03:52 AM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(సీఎస్‌) పదవీ కాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధాని మోదీని కోరారు.

సీఎస్‌ రామకృష్ణారావుకు మరో 3 నెలల ఎక్స్‌టెన్షన్‌?

  • ప్రధాని కి లేఖ రాసిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(సీఎస్‌) పదవీ కాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు సీఎం మార్చి 5న లేఖ రాశారు. ఈ నెల 31తో సీఎస్‌ పదవీకాలం ముగియనుంది. ఈ నెల 16 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అలాగే జనగణన కూడా ఉంది. ఈ నేపథ్యంలో సీఎస్‌ పదవీకాలాన్ని పొడిగించాలని రాష్ట్ర సర్కారు కేంద్రాన్ని కోరింది.

Updated Date - Mar 09 , 2026 | 03:52 AM