Share News

సీజే రాయ్‌ కేరాఫ్‌ లగ్జరీ కార్లు!

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:05 AM

ఆత్మహత్యకు పాల్పడిన కాన్ఫిడెంట్‌ గ్రూప్‌ చైర్మన్‌ సీజే రాయ్‌ వద్ద పెద్ద సంఖ్యలో లగ్జరీ వాహనాలు ఉన్నా యి. ఆయన పాతికేళ్ల వయసులోనే తొలి వాహనం కొన్నారు.

సీజే రాయ్‌ కేరాఫ్‌ లగ్జరీ కార్లు!

  • ఆయన అంతిమయాత్రలో విలువైన కార్ల వినియోగం

బెంగళూరు, ఫిబ్రవరి3 (ఆంధ్రజ్యోతి): ఆత్మహత్యకు పాల్పడిన కాన్ఫిడెంట్‌ గ్రూప్‌ చైర్మన్‌ సీజే రాయ్‌ వద్ద పెద్ద సంఖ్యలో లగ్జరీ వాహనాలు ఉన్నా యి. ఆయన పాతికేళ్ల వయసులోనే తొలి వాహనం కొన్నారు. కేరళకు చెందిన ఆయన బెంగళూరులో స్థిరపడ్డారు. జనవరి 30న ఐటీ అధికారుల దాడులు చేసిన సమయంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాయ్‌ అంతిమయాత్రలో రోల్స్‌రాయ్స్‌ వంటి లగ్జరీ కార్లను వినియోగించడంతో ఆయన కార్ల గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. 2025నవంబరులో రూ.12 కోట్ల విలువైన రోల్స్‌రాయ్స్‌ ఫాంటమ్‌-8ను రాయ్‌ కొన్నారు. గత ఏడాది జూలైలో సోషల్‌ మీడియాలో రోల్స్‌రాయ్స్‌ మోడల్స్‌, లాంబోర్గిని, బుగాటి వెయరాన్‌వంటి లగ్జరీ కార్ల గురించి ప్రస్తావించారు. 1994లో తన తొలికారు మారుతి800ను రూ.1.10 లక్షలకు కొన్నారు. కొన్నాళ్లకు దాన్ని అమ్మే శారు. ఆర్థికంగా బాగా ఎదిగాక తన మొదటి కారు ఉండాలని భావించారు. 27 ఏళ్లకు ఆ కారు తిరిగి తెచ్చిచ్చిన వ్యక్తికి ఆయన రూ.10 లక్షలు ఇచ్చారు.

Updated Date - Feb 04 , 2026 | 03:05 AM