Share News

ఘనంగా భట్టి కుమారుడి వివాహం

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:32 AM

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడు భట్టి సూర్య విక్రమాదిత్య, సాక్షి వివాహం గురువారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిధిలోని జీఎంఆర్‌ ఎరీనాలో వైభవంగా జరిగింది.

ఘనంగా భట్టి కుమారుడి వివాహం

  • గవర్నర్‌ జిష్ణుదేవ్‌, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సీఎం రేవంత్‌తోపాటు మంత్రుల హాజరు

శంషాబాద్‌ రూరల్‌/హైదరాబాద్‌, మార్చి 05(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడు భట్టి సూర్య విక్రమాదిత్య, సాక్షి వివాహం గురువారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిధిలోని జీఎంఆర్‌ ఎరీనాలో వైభవంగా జరిగింది. వేడుకకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించారు. అలాగే, మంత్రులు దామోదార రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌, సినీ నటులు చిరంజీవి, నాగార్జున, తనికెళ్ల భరణి, ప్రకాశ్‌రాజు, రాజేంద్రప్రసాద్‌, శ్రీకాంత్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌ దంపతులు, కేవీపీ రాంచందర్‌రావు, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, పలువురు ఎమ్మెల్యేలు, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, విజయమ్మ తదితరులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలువురు వ్యాపార వేత్తలు సైతం వేడుకకు హాజరయ్యారు. అతిథులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆప్యాయంగా పలకరించారు.

Updated Date - Mar 06 , 2026 | 03:32 AM