Share News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం అసెంబ్లీ ముట్టడి

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:46 AM

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను మార్చి 16న అసెంబ్లీ సమావేశాలు జరిగే లోపు విడుదల చేయకపోతే వేలాది మంది విద్యార్థులతో అసెంబ్లీ ......

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం అసెంబ్లీ ముట్టడి

  • బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ హెచ్చరిక

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను మార్చి 16న అసెంబ్లీ సమావేశాలు జరిగే లోపు విడుదల చేయకపోతే వేలాది మంది విద్యార్థులతో అసెంబ్లీ ముట్టడిస్తామని బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ హెచ్చరించారు. రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బీసీ జేఏసీ నేతలు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సమావేశమయ్యారు. 5 సంవత్సరాలుగా రావాల్సిన రూ.7వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరారు. 22 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యగా ప్రభుత్వం చూడాలని విజ్ఞప్తి చేశారు. రూ.5 వేల కోట్లతో గాంధీ విగ్రహం ఏర్పాటు చేేస బదులు, పేద విద్యార్థుల ఫీజుల కోసం ఆ నిధులను కేటాయించాలన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 04:46 AM