కుమ్మెర జాతర ఘటనపై బీసీ కమిషన్‌కు నివేదిక
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:57 AM
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై జిల్లా కలెక్టర్ బీసీ కమిషన్‌కు సమగ్ర నివేదిక సమర్పించారు. కమిషన్ ఆదేశాల మేరకువిచారణ చేపట్టిన యంత్రాంగం....
హైదరాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై జిల్లా కలెక్టర్ బీసీ కమిషన్‌కు సమగ్ర నివేదిక సమర్పించారు. కమిషన్ ఆదేశాల మేరకువిచారణ చేపట్టిన యంత్రాంగం, బాధ్యులపై తీసుకున్న చర్యలను నివేదికలో వెల్లడించింది. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితులు శ్రీనివాస్ రెడ్డి, మధూసుదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారని బీసీ కమిషన్ తెలిపింది.