10 నుంచి 18 వరకు బతుకమ్మ ఉత్సవాలు
ABN , Publish Date - Oct 04 , 2026 | 07:04 AM
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈ నెల 10 నుంచి 18వ తేది వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు.
ఈసారి బతుకమ్మకు ప్రత్యేక లోగో: సీఎస్
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈ నెల 10 నుంచి 18వ తేది వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఈ మేరకు బతుకమ్మ నిర్వహణపై శనివారం సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 18న సద్దుల బతుకమ్మను ట్యాంక్‌బండ్‌పై వేలాది మంది మహిళలు, వందలాది మంది కళాకారులతో నిర్వహిస్తామని తెలిపారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటారన్నారు. ఈసారి బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేక లోగోను రూపొందిస్తున్నామని, డిసెంబర్‌లో జరిగే ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’లో కూడా ఈ లోగోను ప్రదర్శిస్తామని సీఎస్ వెల్లడించారు.