బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Mar 14 , 2026 | 06:17 AM
బాసరలోని ఆర్‌జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైది.
బాసర, మార్చి 13(ఆంధ్రజ్యోతి): బాసరలోని ఆర్‌జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 18న ప్రారంభమై మే 10వరకు కొనసాగుతుంది. మే 30న ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. వివరాలకు 08752-255344నంబర్‌లో సంప్రదించవచ్చు.