ఏప్రిల్‌లో ఎస్‌ఐఆర్ ప్రారంభానికి చర్యలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:39 AM
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్ ) ప్రక్రియను ఏప్రిల్‌లో ప్రారంభించనున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. ఫారాల....
ఈ వారమంతా బీఎల్‌వోలకు తుది శిక్షణ
హైదరాబాద్, మార్చి 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్ ) ప్రక్రియను ఏప్రిల్‌లో ప్రారంభించనున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. ఫారాల ముద్రణ, బీఎల్‌వోలకు శిక్షణ, వారికి అవసరమైన కిట్ల పంపిణీపై దృష్టి పెట్టామని, ఈ వారం మొత్తం బీఎల్‌వోలకు తుది శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు, సందేహాలు, కొత్త మార్గదర్శకాలపై వారికి అవగాహన కల్పించనున్నారు. ఎస్‌ఐఆర్ పూర్తయి తుది జాబితా వెలువడటానికి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎస్‌ఐఆర్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం పైలట్ ప్రాజెక్టుగా పూర్తి చేసింది. రెండో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ చేపట్టి ఫిబ్రవరిలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. మూడో దశలో తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో ఏప్రిల్‌లో ఎస్‌ఐఆర్ ప్రారంభం కానుంది. ప్రస్తుత జాబితా ప్రకారం రాష్ట్రంలో 3.36 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 37 వేల పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బీఎల్‌వోలు, మరో 15 వేల మంది అసిస్టెంట్ బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లు ఎస్‌ఐఆర్‌లో పాల్గొననున్నారు.