Share News

17 నుంచి అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ పరీక్షలు

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:30 AM

డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తునట్లు అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

17 నుంచి అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ పరీక్షలు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తునట్లు అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 11న మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాయిదా పడ్డ వేర్వేరు సెమిస్టర్ల పరీక్షలను ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి శ్రీనివాస్‌ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, పరీక్షకు 3 రోజుల ముందు విశ్వవిద్యాలయ వెబ్‌ పోర్టల్‌ ఠీఠీఠీ.ఛట్చౌఠౌుఽజూజీుఽ్ఛ.జీుఽ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 03:30 AM