Share News

6 ప్రత్యేక విమానాల్లో శంషాబాద్‌కు 600 మంది

ABN , Publish Date - Mar 05 , 2026 | 05:39 AM

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్‌లోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటున్నారు.

6 ప్రత్యేక విమానాల్లో శంషాబాద్‌కు 600 మంది

శంషాబాద్‌ రూరల్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్‌లోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటున్నారు. మంగళ, బుధ వారాల్లో ఆరు ప్రత్యేక విమానాల్లో 600 మందికిపైగా వచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో స్వదేశానికి చేరుకోగలిగామంటూ ప్రయాణికులు కన్నీటి పర్యంతమయ్యారు. యుద్ధం కారణంగా పలు దేశాలు గగనతలాలను మూసివేయడంతో దుబాయి, అబుదాబి, మస్కట్‌, దమామ్‌, జెద్దా, రియాద్‌లలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు చిక్కుకుపోయారు.

Updated Date - Mar 05 , 2026 | 05:39 AM