Share News

వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో కోతలా?

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:31 AM

వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు 3.04 శాతానికి పడిపోయాయని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు కన్నెగంటి రవి....

వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో కోతలా?

  • రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు 3.04 శాతానికి పడిపోయాయని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు కన్నెగంటి వి, విస్సా కిరణ్‌కుమార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల కోసం అరకొర ప్రకటనలు తప్ప, వ్యవసాయరంగంపై నిరాసక్తతను, నిస్సారమైన విధానాలను మోదీ ప్రభుత్వ బడ్జెట్లో ప్రతిబింబించిందన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు గతేడాదికి ఇప్పటికి రూ.9 వేల కోట్ల బడ్జెట్‌ తగ్గటం ఆందోళకరమన్నారు. ప్రతియేటా కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయకపోవడం లేదన్నారు. 2025-26 బడ్జెట్లో రూ.1.72 లక్షల కోట్లు కేటాయిస్తే రూ.1.52 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. పప్పుధాన్యాల్లో ఆత్మనిర్భరత మిషన్‌, కూరగాయలు, పండ్ల మిషన్‌కు కేటాయింపులు నిరుడు రూ.500 నుంచి రూ.1,000 కోట్లు కేటాయించి, ఇప్పుడు వాటిని సున్నాకు తగ్గించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ కార్మికుల ప్రస్తావన బడ్జెట్‌లో లేదని తెలిపారు. ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా తెచ్చిన వీబీ జీరామ్‌జీ చట్టానికి రూ.95,692 కోట్లు కేటాయించినా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా కేటాయింపులు చేయాలనే నిబంధన పెట్టడంతో పథకం నీరుగారి పోతుందన్నారు. పంటల బీమా నిధులు గత ఏడాదితో పోలిస్తే 15.7 శాతం తగ్గించి రూ.12,200 కోట్లకు పరిమితం చేసినట్లు తెలిపారు. ‘పర్‌ డ్రాప్‌ మోర్‌ క్రాప్‌’ లాంటి సూక్ష్మ ేసద్య పథకాలకు కూడా నిధులు 13.6 శాతం తగ్గిందన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 03:31 AM