హైటెక్స్‌లో 19-22 మధ్య ఐఆర్‌సీ సదస్సు
ABN , Publish Date - Nov 13 , 2026 | 06:09 AM
రహదారుల నిర్మాణం, భవిష్యత్ అవసరాలు తీర్చే రహదారి వ్యవస్థ నిర్మాణంపై విజ్ఞానం పంపిణీ, ఆలోచనల మార్పిడి, వినూత్న విధానాల అన్వేషణకు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) సదస్సు కీలక వేదిక కానుందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు
వినూత్న విధానాల అన్వేషణ వేదిక: మంత్రి కోమటిరెడ్డి
రహదారుల నిర్మాణం, భవిష్యత్ అవసరాలు తీర్చే రహదారి వ్యవస్థ నిర్మాణంపై విజ్ఞానం పంపిణీ, ఆలోచనల మార్పిడి, వినూత్న విధానాల అన్వేషణకు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) సదస్సు కీలక వేదిక కానుందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ నెల 19- 22 తేదీల మధ్య హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 85వ ఐఆర్‌సీ సదస్సు జరగనుందని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో దేశం నలు మూలల నుంచి ఇంజినీర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, విద్యార్థులు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, తయారీ దారులు పాల్గొంటారు. నాలుగు రోజులు జరిగే ఈ సదస్సుతోపాటు ఈ నెల 19న ఐఆర్‌సీ 238వ, 20న జాతీయ రహదారుల పరిశోధనా మండలి 90వ సమావేశం జరుగుతాయన్నారు.