Share News

అసలు రూ.4లక్షలు.. చెల్లించింది రూ.8లక్షలు.. అయినా..

ABN , Publish Date - Jul 29 , 2026 | 08:26 AM

రూ. 4లక్షలు అప్పుగా తీసుకొని వడ్డీతో కలిపి రూ.8లక్షలు చెల్లించినప్పటికీ.. కుటుంబసభ్యులు, సహోద్యోగులకు సందేశాలు పంపిస్తూ తనను వేధింపులకు గురి చేస్తున్న లోన్‌యాప్‌ నిర్వాహకులపై ఓ ఐటీ ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసలు రూ.4లక్షలు.. చెల్లించింది రూ.8లక్షలు.. అయినా..

  • అయినా బంధువులు, సహోద్యోగులకు ఫోన్లు, సందేశాలు

  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): రూ. 4లక్షలు అప్పుగా తీసుకొని వడ్డీతో కలిపి రూ.8లక్షలు చెల్లించినప్పటికీ.. కుటుంబసభ్యులు, సహోద్యోగులకు సందేశాలు పంపిస్తూ తనను వేధింపులకు గురి చేస్తున్న లోన్‌యాప్‌ నిర్వాహకులపై ఓ ఐటీ ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు బాధితురాలు చేసిన ఫిర్యాదు ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్న ఓ ఐటీ ఉద్యోగిని క్రెడిట్‌ కార్డు బకాయిలు చెల్లించేందుకు ఇన్‌స్టంట్‌ లోన్‌ కోసం ప్రయత్నించారు. రూపీఆన్‌ టైం, ఫస్ట్‌ సాలరీ, లెండింగ్‌ ప్లేట్‌ అనే యాప్‌ల ద్వారా మొత్తం రూ.4లక్షలు రుణంగా తీసుకున్నారు. ఇందుకు గాను అసలు, వడ్డీ కలిపి రూ.8లక్షలు చెల్లించారు. అయితే, ఆ మహిళ ఇంకా బకాయి ఉందంటూ లోన్‌యాప్‌ల నిర్వాహకులు ఆమెను వేధించ సాగారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Jul 29 , 2026 | 08:26 AM