ఆటో జేఏసీ నేతలతో ప్రభుత్వ చర్చలు సఫలం.. సమ్మె విరమణ..
ABN , Publish Date - Aug 23 , 2026 | 09:35 PM
ఆటో జేఏసీ నేతలతో తెలంగాణ ప్రభుత్వ చర్చలు సఫలం అయ్యాయి. ఆటో, క్యాబ్ డ్రైవర్ల జేఏసీ డిమాండ్లపై రవాణా శాఖ సానుకూలంగా స్పందించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఆటో జేఏసీ నేతలతో తెలంగాణ ప్రభుత్వ చర్చలు సఫలం అయ్యాయి. ఆటో, క్యాబ్ డ్రైవర్ల జేఏసీ డిమాండ్లపై రవాణా శాఖ సానుకూలంగా స్పందించింది. 14 డిమాండ్లు పరిష్కరిస్తామని రవాణా శాఖ హామీ ఇచ్చింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను ఆటో, క్యాబ్ డ్రైవర్ల జేఏసీ నేతలు విరమించారు. ఆటోలు, ఓలా, ఉబెర్, ఇతర క్యాబ్ సేవలు రోజూలాగే కొనసాగనున్నాయి.
ఆటో జేఏసీ నేతల కొన్ని డిమాండ్లు..
ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయాలి.
ఆటోడ్రైవర్లకు ఇస్తామన్న ఏటా రూ.12వేలు ఇవ్వాలి.
ఓలా ఊబర్, ర్యాపి డో బైకులపై నిషేధం విధించాలి.
ఆటో త్రీవీలర్ లైసెన్స్ పునరుద్ధరించాలి.
గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్ పాలసీని రాష్ట్రంలో అమలు చేయాలి.
ట్రాఫిక్ చలాన్లపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలి.
ఇవి కూడా చదవండి
ఇరాన్ ముందున్న మంచి మార్గం అదొక్కటే: అధ్యక్షుడు పెజెష్కియాన్
చంద్రబాబు, ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించనున్న తొలి నాన్ జీఎంఓ పాప్‌కార్న్ హైబ్రిడ్ వంగడం