Share News

నేర దర్యాప్తులో నూతన సాంకేతికత కీలకం

ABN , Publish Date - Jun 13 , 2026 | 06:54 AM

అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి దీటుగా నేరాల స్వభావం మారుతున్న క్రమంలో నేర దర్యాప్తులో ఆధునిక సాంకేతికతను...

నేర దర్యాప్తులో నూతన సాంకేతికత కీలకం

  • సమర్థ పోలీసింగ్‌కు అదే మూల సూత్రం: డీజీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి దీటుగా నేరాల స్వభావం మారుతున్న క్రమంలో నేర దర్యాప్తులో ఆధునిక సాంకేతికతను వినియోగించడం సమర్ధ పోలీసింగ్‌కు మూల సూత్రమని డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. నేర నియంత్రణ, నేరాల దర్యాప్తు, డేటా విశ్లేషణల్లో నూతన సాంకేతికత కీలకపాత్ర పోషిస్తుందన్నారు. హైదరాబాద్‌లోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో అత్యాధునిక కంప్యూటర్‌ ల్యాబ్‌తోపాటు షీ సైబర్‌ ల్యాబ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు ఆధారిత స్మార్ట్‌ క్రైం అనాలిటిక్స్‌, డేటా మేనేజ్‌మెంట్‌, స్మార్ట్‌ కాన్ఫరెన్స్‌ సదుపాయాలతో రూపొందించిన ఈ వ్యవస్ధ నేరపరిశోధనలో కొత్తఒరవడికి నాంది పలుకుతుందన్నారు. ఈ ల్యాబ్‌లో.. మాట్లాడుతున్న వ్యక్తిని కెమేరా గుర్తించి అతని వైపు తిరగడంతో పాటు, ఆ వ్యక్తిపై ఆటోమేటిక్‌గా జూమ్‌ అవుతూ వీడియో, ఆడియో రికార్డు చేస్తుందని తెలిపారు. బాధితులు, ఫిర్యాదుదారుల అభిప్రాయాలను సైతం డిజిటల్‌ రూపంలో భద్రపరచడం ఈ వ్యవస్ధ ప్రత్యేకత అని అన్నారు.

ఇవి కూడా చదవండి..

అమేథీ పంచాయతీ ఓటర్ల జాబితా నుండి స్మృతి ఇరానీ పేరు గల్లంతు

మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై దాడి.. ఇద్దరి అరెస్టు

Updated Date - Jun 13 , 2026 | 06:54 AM