Share News

గణేశ్‌ విగ్రహం కొనుగోలులో ఘర్షణ

ABN , Publish Date - Sep 16 , 2026 | 06:09 AM

వినాయక విగ్రహం కొనుగోలు విషయంలో విగ్రహ విక్రేతల, కొనుగోలుదారుల మధ్య జరిగిన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్‌ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది.

గణేశ్‌ విగ్రహం కొనుగోలులో ఘర్షణ
ganesh

విక్రయదారుల దాడిలో గాయపడి వ్యక్తి మృతి

ఘట్‌కేసర్‌ రూరల్‌: వినాయక విగ్రహం కొనుగోలు విషయంలో విగ్రహ విక్రేతల, కొనుగోలుదారుల మధ్య జరిగిన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్‌ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జగనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం. పోచారం డివిజన్‌ చౌదరిగూడకు చెందిన పసులాది కిరణ్‌(34) ఆదివారం రాత్రి మరో ఆరుగురు మిత్రులతో కలిసి జోడిమెట్ల సమీపంలో వినాయక విగ్రహాల విక్రయాల కేంద్రానికి వెళ్లాడు. విగ్రహం ధర విషయంలో విక్రేతలైన రాజస్థాన్‌కు చెందిన చౌగారాం, చంపాలాల్‌, ఇంద్‌గారాం, పుల్కిల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రరూపం దాల్చి విగ్రహ విక్రయదారులు కిరణ్‌పై కర్రలతో దాడిచేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తరలించ గా.. చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. కిరణ్‌పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ చౌదరిగూడ గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Sep 16 , 2026 | 06:13 AM