Share News

సినీ నిర్మాత సునీల్ నారంగ్‌కి టోకరా.. రూ. కోటి కొట్టేసిన అకౌంటెంట్

ABN , Publish Date - Apr 11 , 2026 | 09:45 AM

సినీ నిర్మాత, ఏషియన్ ఫిల్మ్స్ అధినేత సునీల్ నారంగ్‌‌ను అకౌంటెంట్ మోసం చేశాడు. దొంగ లెక్కలు చూపి ఏకంగా కోటి రూపాయలు కాజేశాడు.

సినీ నిర్మాత సునీల్ నారంగ్‌కి టోకరా.. రూ. కోటి కొట్టేసిన అకౌంటెంట్
Suniel Narang fraud case

హైదరాబాద్, ఏప్రిల్ 11: ప్రముఖ సినీ నిర్మాత, ఏషియన్ ఫిల్మ్స్ అధినేత సునీల్ నారంగ్‌‌ను అకౌంటెంట్ మోసం చేశాడు. దొంగ లెక్కలు చూపి ఏకంగా కోటి రూపాయలు కాజేశాడు. విశ్వనాథ్ అనే వ్యక్తి సునీల్ నారంగ్ దగ్గర అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. విశ్వనాథ్ బోగస్ అకౌంట్స్‌తో కోటి రూపాయలు కాజేశాడు. ఈ విషయం గుర్తించిన సునీల్ నారంగ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా, విశ్వనాథ్‌ను అరెస్ట్ చేశారు.

Updated Date - Apr 11 , 2026 | 10:01 AM