Share News

మత్తుమందుల తయారీ ముఠాలో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Jun 13 , 2026 | 06:45 AM

అబ్దుల్లాపూర్‌మెట్‌లోని మామిడి తోటలో యూనిట్‌ ఏర్పాటు చేసి అందులో రహస్యంగా మత్తుమందును తయారుచేస్తున్న...

మత్తుమందుల తయారీ ముఠాలో ఇద్దరి అరెస్టు

  • రూ.50 లక్షల విలువైన ఎపిడ్రిన్‌ స్వాధీనం

హైదరాబాద్‌,జూన్‌12(ఆంధ్రజ్యోతి): అబ్దుల్లాపూర్‌మెట్‌లోని మామిడి తోటలో యూనిట్‌ ఏర్పాటు చేసి అందులో రహస్యంగా మత్తుమందును తయారుచేస్తున్న.. పాత నేరస్తుల ముఠాలోని ఇద్దరు సభ్యులను ఈగల్‌ ఫోర్స్‌ అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.50 లక్షల విలువైన 750 గ్రాముల ఎపిడ్రిన్‌ను ఈగల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటకి చెందిన కీసరి మత్స్యగిరి, అతని మిత్రుడు నిమ్మల నరేష్‌ కొన్నాళ్లుగా ఎపిడ్రిన్‌ తయారు చేస్తున్నారు. 2015లో సాధారణ కెమిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన మత్స్యగిరి ఆ తర్వాత గుజరాత్‌కు చెందిన అంతర్రాష్ట్ర మత్తుమందుల తయారీదారులు సంతోష్‌ సింగ్‌, విజయ్‌, అశ్వినిపధక్‌తో చేతులు కలిపాడు. దేశంలోని పలుప్రాంతాల్లో ఎపిడ్రిన్‌ తయారు చేసి విక్రయించాడని ఈగల్‌ డెరెక్టర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు. సంతోష్‌ సింగ్‌ ముఠా మత్తు దందా సరిగా నడవని సమయంలో బంగారునగల షాపుల్లో దోపిడీలకు పాల్పడేవారని తెలిపారు. ఈ కేసులో సంతోష్‌ సింగ్‌, విజయ్‌, ప్రభాకర్‌, అశ్వినిపధక్‌ పరారీలో ఉన్నారని వివరించారు.

ఇవి కూడా చదవండి..

అమేథీ పంచాయతీ ఓటర్ల జాబితా నుండి స్మృతి ఇరానీ పేరు గల్లంతు

మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై దాడి.. ఇద్దరి అరెస్టు

Updated Date - Jun 13 , 2026 | 06:45 AM