Share News

దాతలు స్పందిస్తే.. ఆమె ప్రాణం నిలుస్తుంది!

ABN , Publish Date - Aug 02 , 2026 | 09:20 AM

ఓ రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్నే అతలాకుతలం చేసింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులు మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా వాహనం ఢీకొట్టడంతో భర్త అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు! భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

దాతలు స్పందిస్తే.. ఆమె ప్రాణం నిలుస్తుంది!
Kalwakurthy road accident

  • కల్వకుర్తి రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్య కోమాలో

  • అప్పులు చేసి చికిత్సకు రూ.25 లక్షలు వెచ్చించిన కుటుంబం

  • మరో రూ.30-40 లక్షలు అవసరమంటున్న వైద్యులు

  • దాతలు ఆదుకోవాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

కల్వకుర్తి (ఆంధ్రజ్యోతి): ఓ రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్నే అతలాకుతలం చేసింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులు మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా వాహనం ఢీకొట్టడంతో భర్త అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు! భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నిరుపేదలైన ఆ కుటుంబసభ్యులు, ఆమెను బతికించడం కోసం దొరికిన చోటల్లా అప్పులు చేసి రూ.25 లక్షల దాకా వెచ్చించారు. ఆమె చికిత్స కోసం మరింత డబ్బు అవసరపడుతుందని వైద్యులు చెబుతుండటంతో ఆ కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో పెద్ద మనసున్న దాతల నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.


నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తికి చెందిన వేముల అలివేలు కుటుంబసభ్యులదీ దీనగాథ! ఈ నెల 7న అలివేలు, ఆమె భర్త అంతయ్య వెల్దండలో ఓ వేడుకలో పాల్గొనేందుకు స్కూటీ మీద వెళ్లారు. కార్యక్రమం ముగిశాక అదేరోజు రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి కల్వకుర్తిలోని నాగర్‌కర్నూల్‌ చౌరస్తా వద్ద వీరు ప్రయాణిస్తున్న స్కూటీను వేగంగా దూసుకొచ్చిన ఓ బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అంతయ్య తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు.


అలివేలు తలపై, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను చికిత్స కోసం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కోమాలో ఉన్న ఆమెకు ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆమెకు చికిత్స కొనసాగించేందుకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల దాకా ఖర్చవుతుందని వైద్యులు చెప్పినట్లు, అంత డబ్బు తామెక్కడి నుంచి తేగలమని ఆ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఆమెకు చికిత్స కోసం మానవతా దృక్పథంతో దాతలు, సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు పెద్ద మనసుతో స్పందించి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు. ఈ మేరకు సాయం చేయాలనుకున్న దాతలు 351401001954 అనే ఖాతా నంబరు (ఖాతాదారు పేరు: వేముల బాలరాజు, ఐసీసీఐ, జడ్చర్ల బ్రాంచ్‌, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌: ఐసీఐసీ0003514)లో సాయం డబ్బులు వేయాలని, లేదా 98855 35871 (బాల్‌రాజ్‌ వేముల) నంబరుకు ఫోన్‌ పే చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

థింసా డ్యాన్స్‌ నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌: లోకేశ్‌

నామినేటెడ్‌ పోస్టులకు రంగం సిద్ధం

Updated Date - Aug 02 , 2026 | 09:20 AM