Share News

పీజీ సీటు రాలేదని డాక్టర్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Sep 16 , 2026 | 02:05 AM

మెడిసిన్‌లో పీజీ సీటు రాలేదనే మనోవేదనతో కరీంనగర్‌ రూరల్‌ మండలం తీగలగుట్టపల్లి ప్రాంతానికి చెందిన డాక్టర్‌ పసుల గౌతమ్‌(39) ఆత్మహత్య చేసుకున్నాడు

పీజీ సీటు రాలేదని డాక్టర్‌ ఆత్మహత్య
goutham

కరీంనగర్‌ క్రైం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : మెడిసిన్‌లో పీజీ సీటు రాలేదనే మనోవేదనతో కరీంనగర్‌ రూరల్‌ మండలం తీగలగుట్టపల్లి ప్రాంతానికి చెందిన డాక్టర్‌ పసుల గౌతమ్‌(39) ఆత్మహత్య చేసుకున్నాడు. తీగలగుట్టపల్లిలోని న్యూ సరస్వతినగర్‌లో నివాసం ఉంటున్న గౌతమ్‌ ఎంబీబీఎస్‌ పూర్తి చేసి నాలుగేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేశాడు. గత నెల ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. గతంలో రెండుసార్లు పీజీ ప్రవేశ పరీక్ష రాసినా సీటు లభించలేదు. దీంతో కొంతకాలంగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆదివారం రాత్రి గౌతమ్‌ తన తల్లిదండ్రులు సులోచన, మొగులయ్యలతో ఈ విషయమై మాట్లాడి బాధ ప డుతూ తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి నిద్రించాడు. అనంతరం తెల్లవారు జామున సుమారు మూడు గంటల సమయంలో తల్లి లేచి చూడగా గౌతమ్‌ బెడ్‌రూమ్‌లో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. తల్లిదండ్రులు వెంటనే అతడిని కిందకు దించి ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్‌ రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Sep 16 , 2026 | 02:33 AM