యాదగిరి నృసింహుడి సన్నిధిలో భక్తజన సందడి
ABN , Publish Date - Oct 03 , 2026 | 05:56 AM
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో శుక్రవారం భక్తజనుల రద్దీ నెలకొంది.
స్వామి సేవలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ మహదేవన్
యాదాద్రి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి) : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో శుక్రవారం భక్తజనుల రద్దీ నెలకొంది. సెలవులు కలిసిరావడంతో భక్తులు స్వామివారి ప్రత్యేక పూజలు, దర్శనానికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం 35 వేల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారని అధికారులు తెలిపారు. స్వామివారికి భక్తుల నిత్య కైంకర్యాల ద్వారా రూ.20,40,855 ఆదాయం సమకూరిందని కార్యనిర్వహణాధికారి జె.భవానీశంకర్ తెలిపారు. కాగా లక్ష్మీనరసింహ స్వామిని శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.మహదేవన్ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేదాశీర్వచనం జరిపి, స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.