Share News

ముదిరిన డెలివరీ బాయ్ వివాదం.. అఖిల్ రాజ్ కారు ధ్వంసం..

ABN , Publish Date - Jun 30 , 2026 | 09:40 PM

రాజు వెడ్స్ రాంబాయి సినిమా హీరో అఖిల్ రాజ్.. డెలివరీ బాయ్‌ల మధ్య వివాదం ముదురుతోంది. ఈ ఉదయం అఖిల్ రాజ్‌పై డెలివరీ బాయ్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. అఖిల్‌ కారుపై కొంతమంది డెలివరీ బాయ్స్‌ దాడి చేసినట్లు తెలుస్తోంది.

ముదిరిన డెలివరీ బాయ్ వివాదం.. అఖిల్ రాజ్ కారు ధ్వంసం..
delivery boy controversy

హైదరాబాద్, జూన్ 30: రాజు వెడ్స్ రాంబాయి సినిమా హీరో అఖిల్ రాజ్.. డెలివరీ బాయ్‌ల మధ్య వివాదం ముదురుతోంది. ఈ ఉదయం అఖిల్ రాజ్‌పై డెలివరీ బాయ్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. అఖిల్‌ కారుపై కొంతమంది డెలివరీ బాయ్స్‌ దాడి చేసినట్లు తెలుస్తోంది. అఖిల్‌ నివాసం దగ్గర రెక్కీ చేసి మరీ డెలివరీ బాయ్స్‌ దాడి చేసినట్లు సమాచారం. ఈ మేరకు అఖిల్‌ రాజ్‌ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


వివాదంపై అఖిల్ వివరణ..

ఈ వివాదంపై మంగళవారం మధ్యాహ్నం అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో.. ‘ఓ డెలివరీ బాయ్ మా ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లోని ఫ్లాట్‌ నంబర్ 201లో ఇవ్వాల్సిన పార్సిల్‌ను మా ఇంటికి తెచ్చి ఇచ్చాడు. మా నాన్న పార్సిల్ తీసుకున్నాడు. మా ఇంట్లో ఎవరో ఆర్డర్ చేశారనుకుని మా అమ్మ దాన్ని ఓపెన్ చేసింది. ఇంట్లో ఎవరూ ఆర్డర్ చేయలేదని తెలిసి పక్కన పెట్టేసింది’..


‘20 నిమిషాల తర్వాత డెలివరీ బాయ్ వచ్చాడు. అతడు రాగానే ‘బ్రదర్ మీరు అడ్రస్ క్రాస్ చెక్ చేసుకోలేదా?’ అని అడిగాను. అతడు తాగేసి ఉన్నాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఇంతలో మా అమ్మ ఓపెన్ చేసిన పార్సిల్‌ను తీసుకువచ్చింది. ‘ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అని దారుణమైన మాటలు మాట్లాడాడు. మా అమ్మను అన్నందుకు నాకు కోపం వచ్చింది’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

బర్త్‌‌రైట్‌ సిటిజన్‌షిప్‌ ఉండాల్సిందే.. యూఎస్ సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు చుక్కెదురు..

అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు.. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం

Updated Date - Jun 30 , 2026 | 09:50 PM