Share News

అనుమతి లేకుండా నాగ చైతన్య పేరు, ఫొటో వాడటంపై నిషేధం

ABN , Publish Date - May 29 , 2026 | 01:52 PM

అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని ఢిల్లీ హైకోర్టులో నాగ చైతన్య పిటిషన్ దాఖలు చేశారు. నాగ చైతన్య పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.

అనుమతి లేకుండా నాగ చైతన్య పేరు, ఫొటో వాడటంపై నిషేధం
Delhi High Court

న్యూఢిల్లీ, మే 29: తన వ్యక్తిగత హక్కులు, గోప్యతను పరిరక్షించాలని కోరుతూ అక్కినేని నాగ చైతన్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని ఢిల్లీ హైకోర్టులో నాగ చైతన్య పిటిషన్ దాఖలు చేశారు. నాగ చైతన్య పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. కోర్టు నాగచైతన్య అభ్యర్థనపై సానుకూలంగా స్పందించింది. నాగ చైతన్య వ్యక్తిత్వ హక్కులు పరిరక్షిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా నాగ చైతన్య పేరు, ముఖ రూపం, కంఠస్వరం వాణిజ్యపరంగా వాడటంపై నిషేధం విధించింది.


కొద్దిరోజుల క్రితం నాగార్జున..

తన వ్యక్తిగత హక్కులకు (పర్సనాలిటీ రైట్స్) భంగం కలిగిస్తున్నారంటూ కొద్దిరోజుల క్రితం ఢిల్లీ హైకోర్టులో సినీ నటుడు అక్కినేని నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఓ బట్టల వ్యాపారి దుస్తులపై తన చిత్రాలు, పేరు వాడుతున్నాడని నాగార్జున కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుపై మే 12వ తేదీన కోర్టు విచారణ జరిపింది. న్యాయస్థానం సదరు వ్యాపారిపై సీరియస్ అయ్యింది. నాగార్జున ఫొటోలను వాణిజ్యపరంగా వాడుకునే అధికారం మీకు ఎవరిచ్చారంటూ కోర్టు నిలదీసింది.


వ్యాపారి తరఫు న్యాయవాది శృతి అయ్యర్ వాదనలు వినిపిస్తూ 'ది ఘోస్ట్' సినిమాకు తాము అధికారిక మర్చండైజింగ్ భాగస్వాములమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి తమకు కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి

మందులు వాడేటప్పుడు ఈ 3 తప్పులు చేయొద్దు..

సీసీ కెమెరాలెక్కడ?

Updated Date - May 29 , 2026 | 01:55 PM