Share News

నటి అనసూయపై అసభ్య పోస్టులు.. కడప జిల్లా వ్యక్తి అరెస్ట్..

ABN , Publish Date - Mar 13 , 2026 | 06:37 PM

నటి అనసూయపై అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు కడప జిల్లాకు చెందిన జనార్థన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

నటి అనసూయపై అసభ్య పోస్టులు.. కడప జిల్లా వ్యక్తి అరెస్ట్..
Anasuya Bharadwaj social media abuse

హైదరాబాద్, మార్చి 13: నటి అనసూయపై అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు కడప జిల్లాకు చెందిన జనార్థన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సోషల్‌ మీడియాలో అనసూయపై అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆమె ఫొటోలు, వీడియోలు మార్ఫ్‌ చేసి పోస్టులు చేసినట్లు సమాచారం. కాగా, సోషల్ మీడియాలో వేధింపులపై అనసూయ గత జనవరి నెలలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనపై అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో..


తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా లైంగిక వ్యాఖ్యలు, బెదిరింపులు, అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారని అనసూయ తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి తయారుచేసిన మార్ఫింగ్ కంటెంట్ తన గౌరవాన్ని, భద్రతను ప్రమాదంలోకి నెట్టిందని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం మానసిక వేధింపే కాదు... తన జీవనోపాధి, ప్రజా జీవితంపై ప్రత్యక్ష దాడి అని ఫిర్యాదులో పేర్కొన్నారు.


గతేడాది డిసెంబర్ 23వ తేదీ నుంచి తనపై ఆన్‌లైన్ వేధింపులు పెరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) తో పాటు ఐటీ చట్టంలోని కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనసూయపై అసభ్య పోస్టులు పెట్టిన 42 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి

గ్యాస్ కొరత ఎఫెక్ట్: ఏపీలో హోటళ్ల పనివేళల తగ్గింపు? మంత్రి పయ్యావులతో అసోసియేషన్ భేటీ

పలాసలో తొలి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం

Updated Date - Mar 13 , 2026 | 07:37 PM