Share News

తుమ్మిడిహెట్టిపై 1న ఢిల్లీలో కీలక భేటీ

ABN , Publish Date - Aug 28 , 2026 | 05:43 AM

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబరు 1న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల వనరుల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్‌లో జరిగే సమావేశంలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

తుమ్మిడిహెట్టిపై 1న ఢిల్లీలో కీలక భేటీ
ThummidiHetti

  • నేడు ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

  • అధికారులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబరు 1న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల వనరుల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్‌లో జరిగే సమావేశంలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నిరంతర ప్రయత్నాల నేపథ్యంలోనే సీడబ్ల్యూసీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర గతంలో అంగీకరించిన 148 మీటర్ల ఎత్తుకు బదులుగా 150 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టును నిర్మించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తున్న విషయం విదితమే. 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కడితే... మళ్లీ పంపింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని, 150 మీటర్ల ఎత్తుతో అయితేనే గ్రావిటీ ద్వారా నీటిని తరలించవ్చని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన కేంద్రం(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) అధ్యయనాల ప్రకారం 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కట్టినా.. అదనపు ముంపు పరిమితంగానే ఉంటుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. కీలక ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్రం, మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం వరుసగా సంప్రదింపులు జరుపుతోంది. దాని ఫలితంగానే సెప్టెంబరు 1న కీలక సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీపై శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ సమీక్ష నిర్వహించనున్నారు. నీటి లభ్యతతోపాటు ఇతరత్రా అంశాలపై సమీక్షించి, ఢిల్లీలో జరిగే సమావేశంలో అనుసరించాల్సిన విధానంపై అధికారులకు దిశానిర్దేశనం చేయనున్నారు. అలాగే, కృష్ణా ట్రైబ్యునల్‌లో అనుసరించాల్సిన అంశాలపై సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌తోపాటు న్యాయవాదులతో సీఎం సమావేశం కానున్నారు.


ఈ వార్తలు కూాడా చదవండి

ప్రకృతి విపత్తు కంటే అతి పెద్ద విపత్తు గొడ్డలి పార్టీ: అచ్చెన్నాయుడు

నేపాల్‌కు చైనా వార్నింగ్.. మరో ఉపద్రవం ముంచుకొస్తోందా?

Updated Date - Aug 28 , 2026 | 05:55 AM