సీఈసీ రాజీనామా చేయాలి: రామకృష్ణ
ABN , Publish Date - Oct 07 , 2026 | 06:01 AM
సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు అనుమతితోనే ఫాం-6లో సవరణలు చేశామని గతంలో ఈసీ చేసిన ప్రకటన అవాస్తవమని తేలిందని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.