మిత్రులు మళ్లీ కలిసినట్లు ఉంది
ABN , Publish Date - May 19 , 2026 | 05:32 AM
కేరళలో జరిగిన మహత్తరమైన వేడుక వద్దకు తాను చేరుకున్నప్పుడు.. స్నేహితులు, సహచరులను మళ్లీ కలిసినట్లుగా అనిపించిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
మా లక్ష్యం రాహుల్‌ను ప్రధానిని చేయడమే
ఆ రోజు కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం
కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారోత్సవ వాతావరణాన్ని ‘ఎక్స్’లో వర్ణించిన సీఎం రేవంత్
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): కేరళలో జరిగిన మహత్తరమైన వేడుక వద్దకు తాను చేరుకున్నప్పుడు.. స్నేహితులు, సహచరులను మళ్లీ కలిసినట్లుగా అనిపించిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకలో హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్‌విందర్‌సింగ్ సుక్కు, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్, కర్ణాటక, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు శివకుమార్, భట్టి విక్రమార్క తదితరులతో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇక్కడి వాతావరణంలో ఆశ, ఉత్సాహం, ఉత్సుకత స్పష్టంగా కనిపించాయని పేర్కొన్నారు. ఇక్కడున్న అందరి ఉమ్మడి లక్ష్యం రాహుల్‌గాంధీని దేశానికి ప్రధాన మంత్రిని చేయడమేనని వెల్లడించారు. ప్రధాన మంత్రిగా రాహుల్‌గాంధీ ప్రమాణ స్వీకారం చేసే రోజు కోసం అందరం కలిసి కట్టుగా, ఇదే ఉత్సాహంతో పని చేస్తామని స్పష్టం చేశారు. కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడి వాతావరణాన్ని ఎక్స్ వేదికగా ఈ మేరకు వర్ణించారు. ఈ సందర్భంగా సుఖ్‌విందర్‌సింగ్ సుక్కు, భూపేష్ భగేల్, శివకుమార్, భట్టి విక్రమార్క తదితరులతో కలిసి దిగిన ఫొటోలను సీఎం షేర్ చేశారు. కాగా, కేరళం రాజధాని తిరువనంతపురం నుంచి తిరుగు ప్రయాణమైన సీఎం.. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు.