దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన చంద్రబాబు
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:46 AM
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం ఎన్.చంద్రబాబు దేశ రాజకీయా ల్లో చరిత్ర సృష్టించారని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, టీటీడీబోర్డు సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి అన్నారు.
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి.. ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
హైదరాబాద్, బంజారాహిల్స్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం ఎన్.చంద్రబాబు దేశ రాజకీయా ల్లో చరిత్ర సృష్టించారని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, టీటీడీబోర్డు సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓడినా, గెలిచినా ప్రజలతోనే ఉంటూ జనం, జాతి కోసం, పేదల సంక్షేమ మే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నన్నూరి నర్సిరెడ్డి అధ్యక్షత వహించారు. చంద్రబాబు 76 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేసి డ్రోన్‌తో పూలాభిషేకం చేశారు. 76 కిలోల కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు మాట్లాడుతూ...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు సృష్టించారన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. రాజధాని అమరావతికి రాజముద్ర వేయించిన ఏకైక సీఎం చంద్రబాబు అని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, తెలుగుదేశం ప్రకా్‌షరెడ్డి, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం బోర్డు సభ్యుడు తాళికోట హరికృష్ణ, శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ చిలువేరు కాశీనాథ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు నాయకులు జూబ్లీహిల్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం లో పూజలు నిర్వహించి ఎన్టీఆర్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. బక్కని నర్సింహులు పసుపు రంగుతో అలంకరించిన సైకిల్‌ను సుమారు 3కి.మీ. తొక్కి కేడర్‌లో ఉత్సాహం నింపారు. అనంతరం నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జైరామ్ ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కువద్ద వాయిసెస్ ఫర్ సీబీఎన్ పేరి ట కార్యక్రమం నిర్వహించారు. దీనికి నందమూరి రామకృష్ణ, నటుడు నారా రోహిత్, సినీ నిర్మాత బండ్ల గణేష్ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు ఏపీ అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. నారా రోహిత్ మాట్లాడుతూ యువత చంద్ర బాబును ఆదర్శంగా తీసుకోవాలన్నారు.