Share News

ఆదాయ వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

ABN , Publish Date - Apr 24 , 2026 | 08:37 PM

సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. ​సవరించిన మార్కెట్ విలువలను అమలు చేయాలని నిర్ణయించింది.

ఆదాయ వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
land registration price hike

హైదరాబాద్, ఏప్రిల్ 24: సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. ​సవరించిన మార్కెట్ విలువలను అమలు చేయాలని నిర్ణయించింది. ​మే మొదటి వారం నుంచి రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరగనున్నాయి. పారిశ్రామికవేత్తల ఆమోదంతోనే హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (HILT) పాలసీ అమలుకానున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. ఓఆర్ఆర్ బయట ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.


ఆదాయ సమీకరణపై అశ్రద్ధ వహిస్తే వేటు తప్పదని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ హెచ్చరించింది. ​కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో కార్మికుల వసతి కోసం డార్మెటరీలు తప్పనిసరి చేసింది. కాగా, రాష్ట్రంలో వ్యవసాయ భూముల మార్కెట్ విలువ గరిష్ఠంగా రెండు నుంచి మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎకరాకు 6 లక్షల రూపాయలుగా ఉన్న విలువ 12 లక్షల రూపాయల నుంచి 18 లక్షల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

టిఎల్ సిఎ ఉగాది వేడుకల్లో ‘అమేయా’ ప్రారంభం

వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్‌ఐ సస్పెండ్

Updated Date - Apr 24 , 2026 | 09:02 PM