Share News

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య ‘అవినీతి’ ఒప్పందం

ABN , Publish Date - Oct 03 , 2026 | 06:23 AM

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య పరస్పర అవినీతి బాగోతాలను కప్పిపుచ్చుకునే ‘క్విడ్‌ ప్రో కో’ ఒప్పందం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు ఆరోపించారు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య   ‘అవినీతి’ ఒప్పందం
RAMCHANDERRAO

  • అందుకే బీఆర్‌ఎస్‌ నేతల

అవినీతిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం మౌనం

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య పరస్పర అవినీతి బాగోతాలను కప్పిపుచ్చుకునే ‘క్విడ్‌ ప్రో కో’ ఒప్పందం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి సుపరిపాలన అందిస్తుంటే, తెలంగాణలో మాత్రం ఎవరు ఎక్కువ అవినీతి చేయాలనే అంశంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీఆర్‌ఎస్‌ నేతల అవినీతి చిట్టా విప్పి అరెస్టులు చేస్తామని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్‌ పార్టీ.. నేటికీ ఒక్క కేసులోనూ అరెస్టు చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద జీవో 317ను బీజేపీతో పాటు ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారని, దానికి ప్రత్యామ్నాయంగా తెచ్చిన జీవో 190ని సైతం సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. జీవో 190 పరిధిలో దాదాపు 4,000 మందికి బదిలీలు/డిప్యుటేషన్లు రావాల్సి ఉండగా, 100 నుంచి 200 మందికి మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. దీనిపై గాంధీభవన్‌ ఎదుట ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అన్నదాతలను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశం సందర్భంగా బీజేపీ ేస్టట్‌ సినిమా సెల్‌ కో-కన్వీనర్‌ వైభవ్‌ సూర్య ఆధ్వర్యంలో టీవీ నటులు స్వర్ణలత, లక్ష్మణ్‌, సీనియర్‌ కెమెరామెన్లు సురేష్‌, మహేష్‌ బీజేపీలో చేరారు.

Updated Date - Oct 03 , 2026 | 06:26 AM