Share News

ఈ నెల 17 నుంచి సేవా సంకల్ప్‌ అభియాన్‌

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:06 AM

ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మోదీ 25 ఏళ్ల పాలనను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్‌ అభియాన్‌ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు తెలిపారు

ఈ నెల 17 నుంచి  సేవా సంకల్ప్‌ అభియాన్‌
RAMCHANDERRAO

  • మోదీ పాతికేళ్ల పాలనను

పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

    రాంచందర్‌ రావు వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మోదీ 25 ఏళ్ల పాలనను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్‌ అభియాన్‌ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్‌ 17న మోదీ జన్మదినం నుంచి అక్టోబర్‌ 17 వరకు దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్‌, వ్యాసరచన పోటీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం కూడా ఉన్నందున, ఆ రోజు సాయంత్రం హైదరాబాద్‌లో ‘ఆశీర్వాద్‌ కా దియా’ కార్యక్రమంతో ఈ అభియాన్‌ను ప్రారంభిస్తామన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 03:06 AM