బీఆర్‌ఎస్ దోచుకున్న భూములన్నీ పేదలకు పంచుతాం: బండి సంజయ్
ABN , Publish Date - Sep 17 , 2026 | 03:27 AM
బీఆర్‌ఎస్ దోచుకున్న భూముల్లో కాషాయ జెండాలు ఎగురవేసి, పేదలకు పంచుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో 60ు మంది ప్రజలకు భూముల్లేవని, 25 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి గజం జాగా లేదని.. బీఆర్‌ఎస్ నేతలు మాత్రం వేల ఎకరాలను దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ ఆధ్వర్యంలో దండయాత్ర చేస్తామన్నారు
బీఆర్‌ఎస్ దోచుకున్న భూములన్నీ
పేదలకు పంచుతాం: బండి సంజయ్
దండయాత్ర చేసి కాషాయ జెండా ఎగరేస్తాం
బీఆర్‌ఎస్ కబ్జాలను తేల్చడానికి సీఎం రేవంత్‌కు వెయ్యి రోజులు పట్టిందా?: బండి సంజయ్
కరీంనగర్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్‌ఎస్ దోచుకున్న భూముల్లో కాషాయ జెండాలు ఎగురవేసి, పేదలకు పంచుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో 60ు మంది ప్రజలకు భూముల్లేవని, 25 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి గజం జాగా లేదని.. బీఆర్‌ఎస్ నేతలు మాత్రం వేల ఎకరాలను దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ ఆధ్వర్యంలో దండయాత్ర చేస్తామన్నారు. బుధవారం కరీంనగర్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్‌ఎస్ నేతలు కబ్జాలు చేశారని చెప్పడానికి, కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో ప్రభుత్వ భూమి ఉందని తెలియడానికి సీఎం రేవంత్‌కు వేయి రోజులు పట్టిందా? ఆ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు? అసెంబ్లీ వేదికగా వివరాలు బయటపెట్టి బీఆర్‌ఎస్ నేతలకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారా? యూపీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే అసెంబ్లీలో భూదోపిడీని ప్రస్తావించి బీఆర్‌ఎ్‌సతో బేరసారాలకు సిద్ధమయ్యారు’’ అని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా సిట్ పేరుతో నియమించిన విచారణ కమిటీలు చేసేదేమిటని, 30 రోజుల గడువు పేరుతో డీల్ కుదుర్చుకోవాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలిస్తే 24 గంటల్లో పూర్తి నివేదిక ఇస్తారని పేర్కొన్నారు.