Share News

పొరుగు రాష్ట్రాలతో గిల్లికజ్జాలు సరికాదు

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:48 AM

పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగించుకోవాలే తప్ప గిల్లికజ్జాలు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రంతో సమస్య ఉంటే కూర్చుని ...

పొరుగు రాష్ట్రాలతో గిల్లికజ్జాలు సరికాదు

  • మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్‌.. మీ వల్ల కాకపోతే చెప్పండి.. నేను, కిషన్‌రెడ్డి ఇప్పిస్తాం

  • రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు: బండి సంజయ్‌

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ‘‘పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగించుకోవాలే తప్ప గిల్లికజ్జాలు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రంతో సమస్య ఉంటే కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాలి. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరికాదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభు త్వం సహకరించిందన్న విషయాన్ని మరచిపోయా రా? 6 గ్యారంటీలు, వడ్ల కొనుగోలు అంశంపై ప్రజల ను పక్కదారి పట్టించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్ర యత్నిస్తున్నారు. అందులో భాగంగానే మహారాష్ట్ర సీఎం అపాయిట్‌మెంట్‌ ఇవ్వడంలేదని, ఉప్పెన సృ ష్టిస్తామని మాట్లాడుతున్నారు. సీఎం గారూ..! మీకు అపాయిట్‌మెంట్‌ తీసుకోవడం చేతగాకపోతే.. ఆ విషయాన్ని ఒప్పుకోండి. అప్పుడు నేను, కిషన్‌ రెడ్డి ముందుకొస్తాం. మహారాష్ట్ర సీఎం అపాయిట్‌మెంట్‌ ఇప్పించేందుకు ప్రయత్నిస్తాం’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సంజయ్‌ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ అం టేనే కరప్షన్‌, కలెక్షన్‌, కమీషన్‌ అని విమర్శించారు. రాష్ట్రాన్ని సాధించుకున్నామే తప్ప తెలంగాణ ఆశయాలు, లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోయామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ కుటంబం మా త్రమే బాగుపడిందని ఆరోపించారు. 1400 మందిని బలిని తీసుకుంటే తప్ప కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది బీజేపీయేనని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని, కేంద్రానికి పంపిన నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వడ్లను కొంటోందని ఆయన తెలిపారు. హరియాణ మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. చివరి గింజ వరకూ కొనుగో లు చేస్తామంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోందని విమర్శించారు. ధా న్యం కొనుగోలు చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ బీజేపీతోనే సాధ్యమన్నారు. నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడు తూ, ధాన్యం కొనుగోలు చేయడం చేతగాకుంటే మం త్రులు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 03 , 2026 | 05:48 AM