‘అలయ్ బలయ్’కు రండి
ABN , Publish Date - Sep 12 , 2026 | 02:53 AM
అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాను ప్రతియేటా నిర్వహించే ‘అలయ్ బలయ్’ వేడుకకు హాజరు కావాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి,
బీజేపీ నేత బీఎల్ సంతోష్‌లకు దత్తాత్రేయ ఆహ్వానం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాను ప్రతియేటా నిర్వహించే ‘అలయ్ బలయ్’ వేడుకకు హాజరు కావాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. వారిద్దరినీ దత్తాత్రేయ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఆయన ఆహ్వానాన్ని స్వీకరించిన ప్రహ్లాద్ జోషి, బీఎల్ సంతోష్ ఈసారి అలయ్ బలయ్ వేడుకల్లో పాల్గొంటామని తెలిపారు.