Share News

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. కలెక్టర్‌కు ఫిర్యాదు..

ABN , Publish Date - Feb 18 , 2026 | 09:45 PM

కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. 23వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ శ్వేతపై ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జనరల్ కేటగిరికి చెందిన శ్వేత.. బీసీ రిజర్వ్ స్థానంలో పోటీ చేసి గెలిచారని ఆరోపించారు.

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. కలెక్టర్‌కు ఫిర్యాదు..
Ibrahimpatnam Municipality

హైదరాబాద్, ఫిబ్రవరి 18: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. 23వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ శ్వేతపై ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్ శ్వేత తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జనరల్ కేటగిరికి చెందిన శ్వేత.. బీసీ రిజర్వ్ స్థానంలో పోటీ చేసి గెలిచారని ఆరోపించారు.


మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు తొలగిన అడ్డంకి

ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు బుధవారం అడ్డంకి తొలగింది. ఛైర్మన్ ఎన్నికపై ఫైనల్ డెసిషన్ ఆర్వోదేనని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. 19వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన ఆకుల యాదగిరిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని జిల్లా కలెక్టర్‌తో పాటు పోలీసులను ఆదేశించింది. యాదగిరి కనిపించడం లేదంటూ ఆయన కుమారుడు హరికాంత్ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై హైకోర్టు విచారణ జరిపింది.


ఇవి చదవండి

మీ కళ్ల పవర్ చెక్ చూసుకోండి.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 43 సెకెన్లలో కనిపెట్టండి..

కారుమూరిపై కేంద్ర మంత్రి భూపతిరాజు తీవ్ర ఆగ్రహం

Updated Date - Feb 18 , 2026 | 09:53 PM