జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో సత్తా చాటిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:49 AM
ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ేస్టట్ క్రియేటివిటీ కల్చర్ కమిషన్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ ఫొటోగ్రఫీ 2026 పోటీలలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ బోడగుల లవకుమార్ సత్తా చాటారు
హైదరాబాద్ సెప్టెంబరు 10: ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ేస్టట్ క్రియేటివిటీ కల్చర్ కమిషన్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ ఫొటోగ్రఫీ 2026 పోటీలలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ బోడగుల లవకుమార్ సత్తా చాటారు. ‘నా భారతదేశం, ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యానికి 80 ఏళ్ళు’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ పోటీలో ఆగస్టు 15వ తేదీ ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ తీసిన చిత్రాలను మాత్రమే ఎంపిక చేశారు. ఈ పోటీలో ఒక్క ఫోటో మాత్రమే పంపిన ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ లవకుమార్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. భారత స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగా ఓ ద్విచక్ర వాహనంపై వెళ్తోన్న కుటుంబాన్ని కెమెరాతో క్లిక్‌మనిపించారు. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి, వైవిధ్యత, దేశభక్తిని ఒకే చిత్రంలో బంధించారు. అక్టోబర్ 2న విజయవాడలో జరిగే కార్యక్రమంలో నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకోనున్నారు.