ట్రెక్కింగ్ చేస్తుండగా గుండెపోటు
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:40 AM
వికారాబాద్‌లోని అనంతగిరి అటవీ ప్రాంతంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ట్రెక్కింగ్ చేస్తూ ఓ ఉపాధ్యాయురాలు గుండెపోటుతో ప్రాణం విడిచారు.
అనంతగిరి కొండల్లో మహిళ మృతి
వికారాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌లోని అనంతగిరి అటవీ ప్రాంతంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ట్రెక్కింగ్ చేస్తూ ఓ ఉపాధ్యాయురాలు గుండెపోటుతో ప్రాణం విడిచారు. హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో టౌన్‌షి్‌పనకు చెందిన ప్రియామోల్(47), మౌంట్ కార్మెల్ గ్లోబల్ స్కూల్‌లో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి అనంతగిరి అర్బన్ పార్క్ నుంచి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. వాచ్ టవర్ సమీపానికి చేరుకోగానే కాలుజారడంతో, ప్రియమోల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బంధువుల సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని, ఆమెను వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు కారణంగానే మరణించినట్టు నిర్ధారించారు.